రూ.6,490కే పానసోనిక్ స్మార్ట్ ఫోన్

రూ.6,490కే పానసోనిక్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ పానసోనిక్.. పీ సిరిస్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. పీ91 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర కేవలం రూ.6,490గా కంపెనీ ప్రకటించింది. ఇందులో మల్టీ మోడ్ కెమేరా ఆప్షన్ కూడా ఉంది. దీంతో వివిధ రకాల మోడ్స్ లో ఫోటోలను కాప్చర్ చేయవచ్చు. అతి తక్కువ ధరకి ఎక్కువ ఫీచర్లతో ఈ ఫోన్ ని అందజేస్తున్నట్లు పానసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ పకంజ్ రానా తెలిపారు. బ్లూ, గోల్డ్, బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ అందిస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్స్ లోనూ పానసోనిక్ ఫోన్   లభిస్తుందని ఆయన చెప్పారు.

 

పానసోనిక్ పీ91 ఫోన్ ఫీచర్లు..

5 ఇంచెస్ టచ్ స్క్రీన్

1.1 గిగా హెడ్జ్ ప్రాసెసర్

1జీబీ ర్యామ్

16జీబీ ఇంటర్నల్ మెమరీ

8మెగా పిక్సెల్ వెనుక కెమేరా

5మెగా పిక్సెల్ ముందు కెమేరా

2500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

ఆండ్రాయిడ్ 7.0 నగ్గెట్ ఆపరేటింగ్ సిస్టమ్

డ్యూయల్ సిమ్ తోపాటు మెమరీ కార్డు సైతం వినియోగించుకునే సదుపాయం కలదు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos