రూ.5వేలకే పానసోనిక్ స్మార్ట్ ఫోన్

First Published 8, Feb 2018, 1:06 PM IST
Panasonic P100 launched in India with 8 MP camera at Rs 5299
Highlights
  • తక్కవ ధరకే ఫోన్ అందించడంతోపాటు.. స్పెషల్ ఆఫర్లను కూడా పానసోనిక్ అందిస్తోంది.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ పానసోనిక్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. పానసోనిక్ పి100 పేరిట ఈ స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెండు వేరియంట్లలో ఫోన్ ని విడుదల చేసింది. 1జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.5,299గానూ, 2జీబీ ర్యామ్ వేరియంట్  ఫోన్ ధర రూ.5,999గానూ ప్రకటించారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. బ్లూ, బ్లాక్, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో లభిస్తోంది. ఈ ఫోన్  ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో  అమ్మకానికి సిద్ధంగా ఉంది.


తక్కవ ధరకే ఫోన్ అందించడంతోపాటు.. స్పెషల్ ఆఫర్లను కూడా పానసోనిక్ అందిస్తోంది. గోల్డ్ ఉత్సవ్ కన్‌జ్యూమర్ ఆఫర్ కింద లక్కీ కస్టమర్లకు పలు స్పెషల్ గిఫ్ట్‌లను ఇవ్వనున్నారు. ఈ నెలాఖరు  వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. ఫోన్‌ను కొన్న వారికి లక్కీ కూపన్ కార్డు ఇస్తారు. దానిపై నిర్దిష్టమైన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం లక్కీ కస్టమర్లకు 10 గ్రాముల గోల్డ్ కాయిన్ లేదా పేటీఎం గోల్డ్ లభిస్తుంది. 

పానసోనిక్ పీ100 ఫోన్ ఫీచర్లు..

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే

 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

1 జీబీ, 2జీబీ ర్యామ్

 16 జీబీ స్టోరేజ్

 128 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్

 ఆండ్రాయిడ్ 7.0 నూగట్

 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా

 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

 ఫింగర్‌ప్రింట్ సెన్సార్

  2200 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

loader