బాలీవుడ్ సినిమా దెబ్బకు పాక్ తోకముడిచినంత పనిచేసింది.

అదేంటీ భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ కు పాక్ తోకముడిచిందని తెలుసుకాని బాలీవుడ్ కూడా సర్జికల్ స్ట్రైక్ చేసిందా.. ఎప్పుడు ఎందుకు అని ఆశ్చర్యపోకండి. అవును బాలీవుడ్ సినిమా దెబ్బకు పాక్ తోకముడిచినంత పనిచేసింది. ఇంతకీ విషయం ఏంటంటే...

భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాక్ ప్రభుత్వం అక్కడి థియేటర్లలో బాలీవుడ్ సినిమాల‌ను ఆడించకుండా నిషేధం విధించింది.

గత నాలుగు నెల‌లు నుంచి ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది. అయితే బాలీవుడ్ సినిమాలు థియేటర్ లలో వేయకపోవడం వల్ల ఆ దేశస్తులు ఎవరూ థియేటర్ల కు వెళ్లడం లేదట.

బాలీవుడ్ సినిమాలు లేక‌పోతే థియేట‌ర్ల‌లో ఈగ‌లు తోలుకోవాల్సి వ‌స్తోంద‌ని య‌జ‌మానులు గ‌గ్గోలు పెడుతుండటంతో పాక్ ప్ర‌భుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది.


బాలీవుడ్ సినిమాలను పాక్ థియేటర్లలో ప్ర‌ద‌ర్శించేందుకు ఎట్టకేలకు అనుమ‌తినిచ్చారు. అయితే ఇకపై బాలీవుడ్ సినిమాల ప్ర‌దర్శ‌న‌కు కామ‌ర్స్ మినిస్ట్రీ నుంచి నో ఆబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవాలని అక్కడి థియేటర్లకు సూచించారు.

పాక్ థియేటర్ల లలో 70 శాతం బిజినెస్ బాలీవుడ్ సినిమాల వల్లే జరుగుతుందట. అందుకే అక్కడి థియేటర్ల యజమానులు బాలీవుడ్ సినిమాల నిషేధం విధించినప్పటి నుంచి భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.