Asianet News TeluguAsianet News Telugu

చీర్స్ : ఫ్రెండ్స్ తో కలసి ఒక పెగ్గేసుకుంటే మంచిదే నట

పబ్ లు , బార్లు, పర్మిట్ రూమ్ లు ఇక భారీ గా పెంచుకోవచ్చన్నమాట

oxford researchers raise toast to longer life and Happiness

బయట ప్రపంచంలో బాటిల్ పట్టుకుంటూనే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే వార్నింగ్ గుచ్చి గుచ్చి చూస్తుంది.

 

ఆక్స్ ఫోర్డ్  మానసిక శాస్త్రవేత్తలేమో ఒకటో రెండో పెగ్గులు సరదాగా ఫ్రెండ్స్ తో కలసి లాగిస్తే మజాగా ఉండటమే కాదు, అలసట తీర్చి మనసు తేలికపడేలా చేస్తుందని చెబుతున్నారు.ఏది నిజం?

 

 నలుగురిలో కూర్చుని మద్యం సేవిస్తే   ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. పబ్ లో నయితే చిందులేయిస్తుంది. పాట పాడేలా చేస్తుంది.- ఇది పరిశోధనలో వెల్లడయింది. నిజానికి  మానవ సమాజాలలో జరిగే పెద్ద పెద్ద పండగలు, తిరునాళ్లు, జాతరల వంటి సామూహిక కార్యక్రమాలకు , దీనికి పోలిక ఉందంటున్నారు. వాటిలాగే, మిత్రులతో కలసి మద్యం సేవించడం వల్ల సామాజిక బాంధవ్యం పెరుగుతుందని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

ఎన్ని దుష్ఫలితాలున్నా, భూమ్బీద ప్రతి మానవ సమాజంలో మద్యం సేవించడం కొనసాగుతూ వస్తున్నది,  ఎందుచేత? ఇందుకేనా!

 

మద్యంసేవించడం వల్ల అనేక సాంఘిక ప్రయోజనాలున్నందునే తరతరాలుగా సొసైటీ ఈ అలవాటును వదిలించుకలేకపోయిందనేది  శాస్త్రవేత్తలు వివరణ. ఆక్స్ ఫోర్డ్ శాస్త్రవేత్తలు అనేక పబ్ లు తిరిగి, అక్కడ రెగ్యులర్ మద్యం సేవించే వారి ప్రవర్తను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.

 

పబ్ లలో మిత్రులతో కలసి మద్యం సేవిచండం వల్ల సోషల్ నెట్ వర్క్ విస్తృతమవుతుందని, ఈ సహవాసంలో అలసట, ఆందోళనలు మాయమవుతాయని వారు కనుగొన్నారు.

 

‘సోషల్ నెట్ వర్క్ అనేది మానసిక, శారీరక ఖాయిలా మనలోకి ప్రవేశించకుండాఅడ్డుకుంటుంది. సమాజంలో నలుగురితో కలసి మెలగడమనే అలవాటును పబ్ పెంపొందిస్తుంది. నలుగురితో కలసి స్నేహబంధం ఏర్పరుచుకోవాలన్న తపనను కల్గించేఎండార్ఫిన్ వ్యవస్థను మనిషిలో మద్యం యాక్టివేట్ చేస్తుంది. దీనిఫలితమే...  పబ్ లలో డ్యాన్స్ వేయాలనిపించడం, పాడాలనిపించడం,మన కథలెన్నో చెప్పాలనిపించడం. అసలు చాలా మానవ సమాజాలు  పెద్ద పెద్ద పండగలను, జాతరలను, తిరునాళ్ల వంటి సామూహిక కార్యక్రమాలలో పాల్గొనడాన్ని  ప్రోత్సహించడం లో, రకరకాల తంతులను నిర్వహించడంలో  వుండే రహస్యమిదే నట.

 

ఈ రీసెర్చ్ ఫలితాలను అక్స్ ఫోర్డ్ పరిశోధకులు ‘ఎడాప్టివ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ సైకాలజీ’ జర్నల్ లో ప్రచురించారు.

 

పబ్ లలో బార్లలో  మిత్రులతో కలసి మద్యం సేవించే వారికి విస్తృతంగా సంబంధాలుంటాయని, దీని నుంచి వారు ఎంతో సంతృప్తి పొందుతుంటారని చెబుతూ ఎక్కువ కాలం జీవించేందుకు ఇదొక దారి అని  ఈ పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios