జల్లికట్టు పై ఆర్డినెన్స్ కు కేంద్రం ఆమోదం

తంబీల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు జల్లికట్టు పై కోర్టు నిషేధాన్ని అధిగమించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది.

జల్లికట్టు ఆర్డినెన్స్‌కు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. జల్లికట్టుపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ నాలుగు రోజులుగా తమిళనాట పార్టీలన్నీ ఏకమై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నిన్న దిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ఆమోదానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.