కృష్ణా నదిలో మరో పడవ బోల్తా

one more boat accident in krishna river
Highlights

  • కృష్ణా నదిలో మరో పడవ బోల్తా
  • సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలో బోల్తా పడిన పడవ

 కృష్ణా నదిలో మరో పడవ బోల్తా పడింది. నాలుగు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ బోల్తా పడి 21 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందో మరో పడవ బోల్తా పడింది.  వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిలోని ఇసుకను పడవలోకి నింపి తీసుకొస్తుండగా పడవ ఒక్కసారిగా తిరగబడి బోల్తా కొట్టింది. పరిమితికి మించి ఇసుకను నింపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో పడవలో ఉన్న కార్మికులు కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సమీపంలోనే ఈ పడవ బోల్తా పడటం గమనార్హం.

loader