హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్‌ ఫోన్‌ ధరను  భారీగా తగ్గించింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోన్ ధర ఇప్పటి వరకు రూ.36,999గా ఉండేది. కానీ ఈ ధరను రూ.8వేలు తగ్గించారు. దీంతో ఇప్పుడు నోకియా 8 స్మార్ట్‌ ఫోన్‌ను వినియోగదారులు రూ.28,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే నోకియా 5కు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధరను కూడా రూ.వెయ్యి తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను యూజర్లు రూ.12,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌ లో ఈ మోడల్ ధర రూ.11,299గా ఉంది. 

నోకియా 8 స్మార్ట్‌ ఫోన్‌లో 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు  ఇటీవలే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో బీటా అప్‌డేట్‌ను విడుదల చేశారు. కాగా తగ్గిన ధర ప్రకారం నోకియా 8 ఫోన్‌ను అమెజాన్ , నోకియా 5 ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ లో లభ్యమౌతున్నాయి.