విధినిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని ఓ హోటల్(గెస్ట్ హౌజ్) దారుణంగా కాల్చి చంపాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని షిమ్లాలో అక్రమ కట్టడాలను పరిశీలించేందుకు సంబంధిత అధికారి షైల్ బాలా సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించారు. షిమ్లా పర్యాటక ప్రాంతం కావడంతో.. అనుమతి లేకుండానే చాలా మంది హోటల్స్, రిసార్ట్స్ నిర్మించి బిజినెస్ లు నిర్వహిస్తున్నారు. వారి పనేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.దీనిలో భాగంగానే అధికారులు మంగళవార నారాయణి గెస్ట్ హౌజ్ కి చేరుకున్నారు.

అక్రమంగా గెస్ట్ హౌజ్ నిర్వహిస్తున్న దాని యజమాని విజయ్ కుమార్ ని అధికారి షైలా బాలా ప్రశ్నించగా.. ఆమెపై కాల్పులకు తెగపడ్డాడు. దీంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు సిబ్బంది సైతం గాయపడ్డారు. అనంతరం నిందితుడు విజయ్ అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విజయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.1లక్ష నగదు  బహుమతి కూడా ప్రకటించారు.