ఒడిశా ఎంపీ ఏవీ స్వామి పార్లమెంట్ లో అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన పార్లమెంట్ ఆవరణలో కుప్పకూలిపోయారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రకటించారు. అస్వస్థతకు గురైన కేవీ స్వామిని  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏవీ స్వామి.. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభలో కొనసాగుతున్నారు. ఒకవైపు ఉభయ సభల్లో  టీడీపీ, వైసీపీ ఎంపీలు..  స్పెషల్ స్టేటస్ కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.