ఢిల్లీ, ముంబైలలో అత్యధికంగా కొనుగోళ్లు
పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత బంగారం ధర ఒడిదుడుకులకు లోనైంది. చేతిలో ఉన్న నోట్లన్నీ రద్దు కావడంతో అన్ని కొనుగోళ్లు భారీగా మందగించాయి.
అయితే నవంబర్ 8 నుంచి ( పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ) బంగారం కొనుగోళ్లు మాత్రం అమాంతం పెరిగాయట.
ఇప్పటి వరకు ఎంత బంగారం అమ్మకాలు సాగాయి అనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ ఓ సర్వే జరిపింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
నవంబర్ 8 నుంచి రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 4 టన్నుల బంగారం అమ్మడైపోయిందట.
దీని విలువ రూ.1,500 కోట్లకు పై మాటే.
రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోడానికి బంగారానికి మించిన మరో ప్రత్యామ్నాయం నల్లదొరలకు కనిపించలేదని దీన్ని బట్టి తెలుస్తోంది.
ముఖ్యంగా ముంబై, ఢిల్లీలో అత్యధికంగా బంగారం కొనుగోళ్లు జరిగాయట.
