నోకియా స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునే వారికి శుభవార్త. నోకియా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ ఇండియా.. ‘నోకియా వీక్ కాంపైన్’ని లాంచ్ చేసింది. దీనిలో భాగంగా నోకియా6, నోకియా8 స్మార్ట్ ఫోన్లను అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే వారికి రూ.2,500 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నారు. ఈ ఆఫర్ కేవలం నవంబర్ 17వ తేదీ వరకే అమలులో ఉంటుందని అమేజాన్ తెలిపింది.

 అయితే.. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించాలంటే.. వారు అమేజాన్ ప్రైమ్ మెంబర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ప్రైమ్ మెంబర్ షిప్ లేనివాళ్లు అమేజాన్ పే ద్వారా నోకియా స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేస్తే వారికి రూ.1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాకాకుండా మెంబర్ షిప్ ఉండి నోకియా 6 స్మార్ట్ ఫోన్ ని అమేజాన్ పే ద్వారా కాకుండా వేరే విధంగా కొనుగోలు చేస్తే వారికి రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే త్వరపడండి.