Asianet News TeluguAsianet News Telugu

నిషిత్ అంత్యక్రియలు రేపు నెల్లూరులో

ఈ తెల్ల వారుజామున హైదరాబాద్ లో రోడ్డ ప్రమాదంలో మరణించిన ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ అంత్యక్రియలు రేపు నెల్లూరులో అంత్యక్రియలుజరగుతాయి. ఆయన మృతదేహానికి అపోలో మెడికల్‌ కళాశాలలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. తెలంగాణా నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌ రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భౌతికకాయాన్ని నేడు నెల్లూరుతరలిస్తారు.  

Nishits last rites tomorrow in nellore

ఈ తెల్ల వారుజామున హైదరాబాద్ లో రోడ్డ ప్రమాదంలో మరణించిన ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ అంత్యక్రియలు రేపు నెల్లూరులో అంత్యక్రియలుజరగుతాయి. ఆయన మృతదేహానికి అపోలో మెడికల్‌ కళాశాలలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. తెలంగాణా నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌ రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భౌతికకాయాన్ని నేడు నెల్లూరుతరలిస్తారు.  రేపు నెల్లూరులో నిషిత్‌ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు.

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అపోలో, ఉస్మానియా వైద్య నిపుణులు, అధికారులతో మాట్లాడారు. మంత్రి నారాయణ కుటుంబసభ్యులకు బాసటగా నిలిచేందుకు కామినేని శ్రీనివాస్‌ నెల్లూరు బయల్దేరారు. లండన్‌ పర్యటనలో ఉన్న నారాయణ చెన్నై వస్తున్నారు. ఆయన అక్కడ నుంచి నెల్లూరు చేరుకుంటారు.

 

లోకేశ్  సంతాపం

 

రాష్ట్ర మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి పట్ల ఢిల్లీలో  రాష్ట్ర ఐటి మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై పలువురిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో మంత్రి నారాయణకు అండగా నిలిచేందుకు లోకేశ్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని నెల్లూరుకు బయల్దేరారు. నెల్లూరు చేరుకుని ఆయన నిశిత్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

 

పలువురు నేతల సంతాపం

 

జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి బుధవారం తెలంగాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు జనా చౌదరి, కాంగ్రెస్ నేత  పొన్నాల లక్ష్మయ్య, టిఆర్ ఎస్ ఎమ్మెల్యే  ఎర్రబెల్లి దయాకర్ రావు, నారాయణ, టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ వెళ్లారు.  నిశిత్ మృతిదేహానికి నివాళులర్పించారు. నిశిత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన తీరును వారు తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios