అపకీర్తి పాలయిన తివారి ఎన్నికల ముందు బిజెపికి అంత అవసరమయ్యడా!
ఒక ఏడాది కిందట మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి ఇప్పటి బిజెపి గురించి ఒక మాట అన్నారు.
కాంగ్రెస్ ప్లస్ గోవు కలిపితే బిజెపి అవుతుందని చక్కగా నిర్వచించారు. 2015 అక్టోబర్ నెలలో ఢిల్లీలో ప్రముఖ బిజినెస్ జర్నలిస్టు టిఎన్ నైనన్ రాసిన “టర్న్ అఫ్ ది టార్టాయిస్” పుస్తకావిష్కరణసభలో శౌరి ప్రసంగించారు. నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పాలసీలనే అమలు చేస్తా ఉంది. కాకపోతే, గోవు ను తీసుకువచ్చిందిఅదనంగా. అందువల్ల ఈ ప్రభుత్వం కాంగ్రెస్ + గోవు అన్నారు.
అవినీతిఆరోపణలలో గాని, రాజకీయంగా అభాసు పాలయిన వారిని పార్టీలోచేర్చుకోవడంలో గాని నరేంద్రమోదీ నాయకత్వంలో సాగుతున్న బిజెపి కాంగ్రసీకరణ పూర్తిచేసుకుంటుూ ఉంది.
శౌరీ నిర్వచనం ప్రభుత్వానికే కాదు, పార్టీకి చక్కగా వర్తిస్తుంది. బిజెపి=కాంగ్రెస్ + గోవు, అని ఈ రోజు మరొక సారి రుజువయింది.
ఈ రోజు కాంగ్రెస్ ఉత్తరాఖండ్ వృద్ధ జంబూకం నారాయణ్ దత్ తివారీ ఈ రోజు తొమ్మిది పదుల దాటాక కొడుకు రోహిత్ శేఖర్ తో కలసి భారతీయ జనతా పార్టీలో చేరారు. వారిని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆలింగనం చేసుకుని పార్టీలోకి ఆహ్వనించారు.
తివారీ కాకలు తీరిన కాంగ్రెస్ నాయకుడే. ఉత్తర ప్రదేశ్ కే కాదు,ఆ రాష్ట్రం చీలిపోయాక, ఏర్పడిన చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ కి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తర్వాత (ఉమ్మడి) ఆంధ్రలో గవర్నర్ (2007-2009) గా చతికల పడ్డారు. హైదరాబాదా రాజ్ భవన్ ని వేశ్యాగృహంగా మార్చారనే అరోపణలతో అభాసు పాలయి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన అక్రమ సంతానం సమస్య వచ్చింది. అది సక్రమమేనని రుజువయ్యే సరికి తప్పొప్పుకుని రోహిత్ శేఖర్ ని కొడుకుగా స్వీకరించారు.
ఇంత అపకీర్తి పాలయిన తివారి ఎన్నికల ముందు బిజెపికి అవసరమయ్యాడు. పోగాలం దాపురించినట్లనిపిస్తుంది. అందుకే అరుణ్ శౌరి బిజెపికి ఇచ్చిన నిర్వచనం బిజెపిని జాగ్రత్తగా గమనిస్తున్నవాళ్లద్దరికి గుర్తొస్తుంది.
