బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి, తనయుడు లోకేశ్

First Published 17, Nov 2017, 3:06 PM IST
Naidu son and it minister lokesh receive bill gates at vizag airport
Highlights

విశాఖకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్

విశాఖ లో జరుగుతున్న AP AgTech Summit 2017 ముగింపు సమావేశానికి బిల్ గేట్స్ హాజరవుతున్నారు. బహుశా వ్యవసాయ సంబంధమయిన ఒక కార్యక్రమానికి మైక్రో సాఫ్ట్ వేర్ అధినేత హాజరవడం  ఇదే మొదటి సారేమో. బిల్‌గేట్స్‌ కొద్ది సేపటిక్రితం విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి మంత్రి లోకేశ్ తో కలసి ఆయనకు ఘనస్వాగతంపలికారు. ‘ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయసాంకేతిక శిఖరాగ్ర సదస్సు-2017’ముగింపు సభలో ఆయన పాల్గొని కీలకోపన్యాసంచేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రిచంద్రబాబుతో సమావేశమవుతారు.బిల్‌గేట్స్‌ పర్యటనసందర్భంగా దాదాపు 2500 పోలీసులతోబందోబస్తు ఏర్పాటు చేశారు.

 

దీని మీద  నారా లోకేశ్ ట్వీట్

loader