అమరావతి ప...క్కా లోకల్.. పక్కాలోకల్ సింగపూర్

అమరావతి ప...క్కా లోకల్.. పక్కాలోకల్ సింగపూర్

రాజధాని అమరావతి పేరుతో ఒక కాంక్రీట్ జంగిల్ నిర్మించాలని అనుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇక్కడి సహజసిద్ధ వనరులను ఉపయోగించుకుంటూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యద్భుతమైన రాజధానిని నిర్మించాలన్నదే తన ప్రయత్నమని ముఖ్యమంత్రి అన్నారు. ‘తొందర్లో  అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతాయి. 1500 ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో తీసుకొస్తున్నాం.30 నిమిషాలలో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేరుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకుంటాం,’  అని ఆయన చెప్పారు.

సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి ఈశ్వరన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్‌సీ) రెండవ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణ,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సింగపూర్ నుంచి నేషనల్ డెవలప్‌మెంట్ సెకండ్ మినిస్టర్ డెస్మోండ్ లీ, ప్రత్యేక రాయబారి గోపినాథ్ పిళ్లయ్, సెకండ్ పర్మనెంట్ సెక్రటరీ పింగ్ ఛియాంగ్ బూన్.  అమరావతిలో ఉష్ణోగ్రతను తగ్గించే డిస్ర్టిక్ కూలింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రికి సింగపూర్ డిస్ట్రిక్ కూలింగ్ మేనేజింగ్ డైరెక్టర్ జిమ్మీ ఖూ వివరించారు. ఈ తరహా వ్యవస్థ ప్రపంచంలో తొలిసారి సింగపూర్‌లో ఏర్పాటుచేశామని జిమ్మీతెలిపారు.దీనికి స్పందిస్తూ  40 శాతం ఇంధనాన్ని ఆదా చేయగలిగే డిస్ట్రిక్ కూలింగ్ వ్యవస్థను అమరావతిలో  ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సింగపూర్ సంస్థను కోరారు.

2018 రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వస్తున్న సింగపూర్ ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమరావతిని సందర్శించేలా చూడాలని సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌నుముఖ్యమంత్రి కోరారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos