రక్తపుమడుగులో పడిపోయిన జాన్సన్ ను స్థానికులు ఆస్పత్రికి తీసుకపోయే లోపే అతను మరణించాడు.
కేరళలోని కొచ్చిలో దారుణం చోటు చేసుకుంది. ప్లేట్ వడ కోసం ఓ కస్టమర్ హోటల్ యజమానిని కిరాతకంగా చంపేశాడు.
బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎల్లంకులంలో జాన్సన్ అనే వ్యక్తి సిబిన్ పేరుతో ఓ హోటల్ నడుపుతున్నాడు. అయితే బుధవారం ఆయన హోటల్ కు తమిళనాడు వాసి రతీష్ వచ్చాడు.
ఓ ప్లేట్ వడ ఆర్డర్ ఇచ్చాడు. అయితే వడ సర్వ్ చేసే సమయంలో రతీష్ కు జాన్సన్ కు మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో రెచ్చిపోయిన రతీష్ హోటల్ సిబ్బందిపై విరుచుకపడ్డాడు. అడ్డొచ్చని యజమాని జాన్సన్ మెడపై కత్తితో దాడి చేశాడు.
రక్తపుమడుగులో పడిపోయిన జాన్సన్ ను స్థానికులు ఆస్పత్రికి తీసుకపోయే లోపే అతను మరణించాడు.
అయితే ఈ విషయం తెలియడంతో హంతకుడు రతీష్ అక్కడి నుంచి ఉడాయించాడు. మరదు పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.
