Asianet News TeluguAsianet News Telugu

వందేమాతరాన్ని అవమానించిన వ్యక్తి: రాహుల్ గాంధీపై మోడీ అటాక్

కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Modi launched his campaign in Karnataka elections

బెంగళూరు: కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వందేమాతరాన్ని అవమానించిన వ్యక్తి కాంగ్రెసు అధ్యక్షుడిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుది మాటల ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. 

దేశాన్ని కాంగ్రెసు పక్కదారి పట్టిస్తోందని అన్నారు. ఇక్కడి కాంగ్రెసు ప్రభుత్వం రెండు గ్రామాలకు మాత్రమే విద్యుత్తును అందించిందని ఆయన చెప్పారు. తాము12 వేల గ్రామాలను విద్యుదీకరించామని చెప్పారు. 

రాష్ట్రంలో బిజెపి గాలి వీస్తోందని ఇక్కడి రావడానికి ముందు తాను విన్నానని, ఇప్పుడు చూస్తే అంతకన్నా ఎక్కువ కనిపిస్తోందని, బిజెపికి అనుకూలంగా తుఫాను వీస్తోందని ఆయన అన్నారు. 

రాహుల్ జీ మీరు నామ్ దార్ (మీకు పెద్ద పేరు ఉంది), మేం కామ్ దార్ (పనిపై దృష్టి పెట్టినవాళ్లం) అని మోడీ అన్నారు. కాంగ్రెసు మంత్రులు, వారి పిల్లలు కూడా పోటీ చేస్తున్నారని, అది ఓ ప్లస్ వన్ ఫార్ములా అని, కర్ణాటకను కుటుంబ రాజకీయాలు బాధిస్తున్నాయని అన్నారు. 

మోడీ హిందీలో చేసిన ప్రసంగాన్ని కనడలోకి అనువాదం చేస్తూ వచ్చారు. లోకాయుక్త కార్యాలయాన్ని బలోపేతం చేస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారని అంటూ గత ఐదేళ్లుగా ఏం చేస్తున్నారని తాను ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నాని అన్నారు. 

తాము అధికారంలోకి వస్తే లోకాయుక్తను పునరుద్ధరించి ముఖ్యమంత్రిపై, ఆయన కోటరీపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. చామ్ రాజ్ నగర్ లో మోడీ ర్యాలీ జరిగింది. 

పేదల కోసం కాంగ్రెసు ఏమీ చేయలేదని అన్నారు. బిజెపిని విమర్శించడానికే రాహుల్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. తన లక్ష్యం రాజకీయాలు కాదని, అభివృద్ధి అని చెప్పారు. రాహుల్ గాంధీ కనీసం మన్మోహన్ సింగ్ ను కూడా కూడా గౌరవించరని అన్నారు. కర్ణాటకలో 39 గ్రామాలకు కరెంట్ సౌకర్యం లేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios