మొబైల్  దురలవాటు  ఎంత పనిచేసిందో చూడండి.ఒక అమ్మాయి రైలు వస్తున్నదా లేదా అని లెక్క చేయకుండా  రైలు పట్టాలు దాటబోయింది. రైలు వచ్చి కొట్టింది. అంతే,  రైలు కింద పడింది. స్టేషనంతా అరుపులు కేకలు...అమె మీద నుంచి రెండు మూడు బోగీలు పోయాయి. చివరకు రైలాగింది. అయితే...

మొబైల్ దురలవాటు ఎంత పనిచేసిందో చూడండి.

ఒక అమ్మాయి రైలు వస్తున్నదా లేదా అని లెక్క చేయకుండా రైలు పట్టాలు దాటబోయింది. రైలు వచ్చి కొట్టింది. అంతే, రైలు కింద పడింది.

ముంబై లోని కుర్లా రైల్వే స్టేష‌న్ లో ఈ దుర్ఘటన జ‌రిగింది. బాండూప్ కు చెందిన ప్ర‌తిక్షా న‌టెక‌ర్ కుర్లాలోని త‌న ఫ్రెండ్ ను క‌ల‌వ‌డానికి వ‌చ్చింది. తిరిగి బాండూప్ వెళ్ల‌డానికి కుర్లా స్టేష‌న్ లోని 7 వ నెంబ‌ర్ ప్లాట్ ఫాం కు వెళ్లాలనుకుంది. ఫ్లైవోవర్ ఎక్కి వెళ్లకుండా, ప్లాట్ ఫాం దిగి పట్టాలు దాటాలనుకుంది, అది కూడా ఫోన్ లో మాట్లాడతూ.

అదే స‌మ‌యంలో ఆ పట్టాల మీదకు గూడ్స్ రైలు వచ్చింది. చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో గూడ్స్ సౌండ్ వినిపించలేదు. తలపక్కకెత్తిచూసే స్థితి కూడా లేదు. అయితే, ఫ్లాట్ ఫాం పై ఉన్న ప్ర‌యాణికులు ప్ర‌తిక్షను గమనించారు. ఏమిజరగబోతున్నదో కూడా పసిగట్టారు. కేక‌లు వేశారు.

అపుడు స్పృహలోకి వచ్చిన ప్రతిక్ష తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాని, ట్రైన్ త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చేసింది.కొట్టేసింది. తర్వాత కేకలు విని గూడ్స్ డ్రైవ‌ర్ స‌డెన్ గా బ్రేక్ వేశారు.రెండు మూడు బోగీలు వెళ్లిన త‌ర్వాత ట్రైన్ ఆగిపోయింది.ప్రతీక్ష చనిపోయిఉంటుందనుకున్నారు. అలా జరగలేదు. ట్రాక్ మ‌ధ్య‌లో ప‌డిపోయింది. ఆమెను ట్రైన్ కింది నుంచి బ‌య‌ట‌కు లాగారు.పెద్ద పెద్ద గాయాలు ఏం కాలేదు. కంటి దగ్గిర చిన్న గాయమయింది. వెంట‌నే బాధితురాలిని ద‌గ్గ‌ర్లోని రాజావాడి హాస్ప‌టిల్ కు త‌ర‌లించారు. ఇదంతా అంతా రైల్వే స్టేష‌న్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది.