చంద్రబాబు దీక్ష.. హిందీలో బాలకృష్ణ ప్రసంగం

MLA Nandamuri Balakrishna Speaks in Hindi at CM chandrababu hunger strike
Highlights

వైరల్ అవుతున్న బాలకృష్ణ వీడియో

రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దీక్షకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. అనంతరం.. ఆయన ప్రసంగించారు.కేంద్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. కాగా.. ఇప్పుడు బాలకృష్ణ చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. ఎందుకంటే.. జాలయ్య.. తన ప్రసంగాన్ని హిందీలో వినిపించారు. ప్రధాని మోదీకి అర్థం కావాలనే తాను హిందీలో మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పారు.

మోదీ రాజ్యాంగంతో పాటు తన భార్యను కూడా గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. దేశంలో రెండో భాష తెలుగని.. ప్రధానిగా ఉన్న మోదీ తెలుగు నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇక యుద్ధం మొదలైందని.. భాజపాను ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. అప్పట్లో భాజపాకు అధికార బిక్ష పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబులేనని గుర్తుచేశారు. తెలుగువారు పిరికివారు కాదని చిల్లర రాజకీయాలు చేస్తూ అపహాస్యం చేయొద్దని హెచ్చరించారు. వైకాపా, భాజపా లోపాయికారీ ఒప్పందాలు అందరికీ తెలుసనని... వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఒక్క సీటు కూడా రాదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కొక్కరు విప్లవ యోధులు కావాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

loader