చంద్రబాబు ఇంటిపై కన్నేసిన మంత్రి నారాయణ

చంద్రబాబు ఇంటిపై కన్నేసిన మంత్రి నారాయణ

సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై మంత్రి నారాయణ కన్నేసారా? చంద్రబాబు నివాసాన్నే కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ పరంగా ఉన్న అడ్డంకులను తొలగిస్తూ.. ఎన్జీటీ( నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా ఎన్జీటీ నిబంధనల ప్రకారం కరకట్ట లోపల ఉన్న అన్ని కట్టడాలను తొలగించేస్తానని కూడా చెప్పారు. అయితే.. సీఎం చంద్రబాబు నివాసం కూడా ఆ కరకట్ట పరిధిలోకే వస్తుంది కదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి సమాధానంగా పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణా నది కరకట్ట లోపల ఉన్న సీఎం నివాసాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. కాగా.. మంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ తో టీడీపీ నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.  అక్రమ కట్టడాల నిర్మూలనలో మంత్రి నారాయణ.. సీఎం నివాసంపై కన్నేసారా..? అందుకే ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తున్నారా అంటూ టీడీపీ నేతలే గుసగులాడుకుంటున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos