ఖైదీ నెంబర్ 150 చిత్రం ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్ ఈ నెల 4 న విజయవాడలో నిర్వహణకు నిర్ణయం ఇప్పటివరకు అనుమతివ్వని ఏపీ ప్రభుత్వం సీఎంపై ఫైర్ అవుతున్న చిరు అభిమానులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిరు అభిమానుల దృష్టిలో విలన్ గా మారిపోయారు. చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీనెంబరు 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలను విజయవాడలో ఈ నెల 4న నిర్వహించాలని నిర్ణయించారు. స్వయంగా చిరు తనయుడు రాంచరణ్ ఈ విషయాన్ని తెలిపాడు.
దీనికి సంబంధించి విజయవాడలో ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఫంక్షన్ కు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో చిరు అభిమానులు ఏపీ ప్రభుత్వంపై మండి పడుతున్నారు.
ఏపీని సినీ పరిశ్రమకు కేంద్రంగా మారుస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు ఒక సినిమా పంక్షన్ కు కూడా అనుమతి ఇవ్వకపోవడం దేనికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
ఆ చిత్రం ఫంక్షనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవిపై రాజకీయ కక్షతోనే ఆ చిత్రం వేడుకలకు అనుమతి ఇవ్వటం లేదని విమర్శించారు.
ఇటీవల తిరుపతిలో ఓ అగ్రహీరో చిత్రం ఫంక్షన్ కు స్వయంగా హాజరైన సీఎం .. తమ హీరో చిత్రం ఫంక్షన్ కు కనీసం అనుమతి కూడా ఇవ్వకపోవడం రాజకీయ కక్షసాధింపు చర్యలా ఉందని ఆరోపించారు.
