డిసెంబర్ లో పన్ను వసూళ్ళు పెరిగాయంటే, అందుకు కారణం రద్దైన నోట్లన్నీ తీసుకువచ్చి పన్నులు కట్టేసారు. డిసెంబర్ దాటితే ఆ నోట్లు ఎటూ చెల్లవు కాబట్టే పన్నులు కట్టేసారు. దాంతో వసూళ్ళు పెరిగాయి.
పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన దుష్పరిణామాలను కేంద్రప్రభుత్వం చాలా తక్కువ చేసి చూపటానికి నానా అవస్తలు పడుతున్నది. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం పన్నుల వసూళ్ళపై ఏమాత్రం లేదని చెప్పటం ఇందులో భాగమే.
పారిశ్రామికవేత్తలు, సామాజిక అధ్యయన సంస్ధలు అన్నీ నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాలపై ఓ వైపు మొత్తుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నదే. ఎవరి వాదన ఎలాగున్నా సామాన్యుని జీవనంపై నోట్ట రద్దు పెద్ద దెబ్బనే కొట్టిందన్నది వాస్తవం.
క్షేత్రస్ధాయిలో వాస్తవాలు ఈ విధంగా ఉంటే మోడి, జైట్లీ మాత్రం తమ చర్యను సమర్శించుకుంటూ మాట్లాడుతుండటం ఆశ్చర్యం. నవంబర్, డిసెంబర్ లో పన్ను వసూళ్లు పెరగటమే నిదర్శనమని విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు.
పైగా నోట్ల రద్దును ప్రజలందరూ స్వాగతించారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే, గడచిన రెండునెలల్లో దేశ ఆర్ధిక వ్యవస్ధ కుదేలైందని ఆర్ధికరంగంలోని నిపుణులు మొత్తుకుంటున్నారు.
జైట్లీ చెప్పినట్లు నవంబర్, డిసెంబర్ లో పన్ను వసూళ్ళు పెరిగాయంటే, అందుకు కారణం రద్దైన నోట్లన్నీ తీసుకువచ్చి పన్నులు కట్టేసారు. డిసెంబర్ దాటితే ఆ నోట్లు ఎటూ చెల్లవు కాబట్టే పన్నులు కట్టేసారు. దాంతో వసూళ్ళు పెరిగాయి. అదే నిజమైన అభివృద్ధి అనుకుంటే జైట్లీ ఎంత మేధావో అర్ధమవుతోంది.
నోట్ల రద్దు వల్ల దేశానికి, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంగీకరించే నిజాయితీ కూడా ప్రధాని, జైట్లీలో లోపించటం నిజంగా దురదృష్టమే. నోట్ల రద్దు దేశానికి మంచే జరిగిందంటూ వాళ్లు భ్రమల్లో బ్రతుకుతూ దేశమంతా బ్రతకాలని కోరుకుంటున్నారు.
ఎందుకంటే, నోట్ల రద్దు సమయంలో మోడి చెప్పినవన్నీ కథలేనని నిరూపితమైంది. నల్లధనం ఎక్కడా బయటపడలేదు. నల్ల కుబేరులెవరూ పట్టుబడలేదు. ఉగ్రవాదం ఏమాత్రం తగ్గలేదు. ఇవన్నీ మోడి అబద్దాలు చెప్పారనటానికి నిదర్శనాలే.
ఇదిలావుండగా, వచ్చే మార్చికి ఉపాధి అవకాశాలు భారీ తగ్గుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2 నెలల్లో 60 శాతం ఉద్యోగాలకు ఎసరు వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే 35 శాతం ఊడాయి. ఉత్పత్తి రంగం, రియల్ ఎస్టేట్, రవాణా రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సూక్ష్మ,చిన్న పరిశ్రమలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
భారీ పరిశ్రమలకు సైతం పెద్ద దెబ్బేనని పారిశ్రామికవేత్తలు మొత్తుకుంటున్నారు. తమిళనాడు, మహారాష్ట్రల్లో దెబ్బ స్పష్టంగా కనబడుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఏఐఎంవో అధ్యక్షుడు మాట్లాడుతూ, నోట్ల రద్దు వల్ల దేశానికి జరిగిన నష్టాన్ని అంగీకరించటానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల అంతా మంచే జరుగిందని వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటున్నట్లు ఎద్దేవా చేసారు.
