వరంగల్: వరంగల్ లో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి అతని తలనూ మొండేన్ని వేరు చేశారు. మొండేన్ని గోనెసంచీలో కుక్కి పడేశారు. తలను మరో చోట పడేశారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్ద మొండెం ఉన్న గోనె సంచీ కనిపించింది. ఈ హత్య తీవ్ర కలకలం సృష్టించింది.

హతుడిని సాంబయ్యగా గుర్తించారు. ప్రతికుమార్ అనే వ్యక్తి అతన్ని చంపి ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇరువురి మధ్య వర్గ పోరే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.

మామూళ్ల వసూళ్లు, తదితర విషయాల్లో ఇరువురి మధ్య తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కడే ఈ హత్య చేశాడా, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.