మల్కాజిగిరి బచ్ పన్ స్కూల్ యాజమాన్యం అరెస్ట్

First Published 15, Nov 2017, 6:17 PM IST
malkajgiri bachpan school management members arrest
Highlights
  • మల్కాజిగిరి బచ్ పన్ స్కూల్ యాజమాన్యం అరెస్ట్
  • రచిత్ అనే చిన్నారి బాలుడి మరణానికి కారణమైన నిందితులు 

మల్కాజ్ గిరి బచ్ పన్ స్కూల్ చిన్నారి రచిత్ మరణానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీనికి కారణమైన స్కూల్ ప్రిన్సిపాల్, కౌన్సెలర్, వాచ్ మెన్ లను పోలీసులు అదుపెలోకి తీసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరికి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.  

మంగళవారం మల్కజిగిరి స్కూల్ ఆవరణలోని సంపులో పడి యూకేజీ బాలుడు రచిత్ చనిపోయిన విషయం తెలిసిందే. స్కూల్ ఆవరణలో చిన్నారులు వుంటారని తెలిసికూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్య సభ్యులతో పాటు వాచ్ మెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని దీంట్లో మరెవరి నిర్లక్ష్యం ఉందని తెలిసినా వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

పోలీసులు అరెస్ట్ చేసిన  నిందితుల వివరాలు 
1) K.రాఘవేంద్ర s/o వీర కుమార్ (40 సంవత్సరాలు), స్కూల్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్  
2)  ఎల్.ఉన్నికృష్ణన్ W/o ఎం.కే.ఉన్నికృష్ణన్ (47 సంవత్సరాలు), స్కూల్ కౌన్సెలర్  
3) పాట్రిక్ S/o ఆరోగ్య సమి, (52 సంవత్సరాలు), వాచ్ మెన్  

loader