సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ట్రాఫిక్ పోలీసులు సాయంత్రం సమయంలో నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా మందుబాబులు రోడ్లపైకి వస్తుంటారని. కానీ ఈ తాగుడుకు సమయం సందర్భం లేదని నిరూపించాడు ఈ ఆటోడ్రైవర్.  మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు విచిత్రంగా ఇవాళ ఉదయం చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో ఓ ఆటో డ్రైవర్ అడ్డంగా బుక్కయ్యాడు. 

మలక్ పేటలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు అంబర్ పేటకు చెందిన ఆటోడ్రైవర్ మురళికి బ్రీత్ అనలైజర్ తో పరీక్షనిర్వహించారు. అందులో రీడింగ్ 110 గా నమోదయ్యింది. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు అతడిని ప్రశ్నించగా, తాను ఇప్పుడు తాగలేదని రాత్రి తాగింది దిగలేదని సమాధానమిచ్చాడు. ఇలా రాత్రి మందు తాగి, పొద్దున పోలీసులకు చిక్కడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు పోలీసులు.  

 

పోలీసులకు చిక్కిన మందుబాబు ఏమంటున్నాడో కింది వీడియోలో చూడండి