ప్రముఖ పుణ్య క్షేత్రం మధుర మీనాక్షి దేవాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో.. ఆలయంలోని రాజగోపురం వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో.. ఆలయ సమీపంలోని దాదాపు 50కిపైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని  దాదాపు 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.  ప్రమాద సమయంలో ఆలయంలో పూజార్లు, భక్తులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. కాగా.. ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.