ఆదిలాబాద్ జిల్లాలో ఒ వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహితను జబ్బు నయం చేస్తానని నమ్మించి ఓ దర్గా వద్ద ఉండే బాబా ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాగునీటిలో మత్తుమందు కలిపి మంత్రించి ఇచ్చానని చెప్పి ఆమెతో తాగించి మరో ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ ఘటనకు సంబంధించిన  వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర ఔరంగబాద్ కు చెందిన ఓ మహిళ చర్మ వయాధితో బాధపడుతూ నయమవుతుందని నమ్మి ఓ దర్గాకు వెళ్లింది. అయితే అక్కడ  ముజఫర్ బాబా ఆమెకు పరిచమయ్యాడు. తన మంత్రాలతో జబ్బు నయం చేస్తానని చెప్పి నమ్మించి మొదట ఆమె దగ్గరి నుండి డబ్బులు గుంజాడు. అయితే నెలలు గడుస్తున్నా ఆరోగ్య పరిస్థితి బాగుపడక పోవడంతో మరోసారి బాబా దగ్గరికి వెళ్లింది. అయితే ఇదేదో తనకు అంతు చిక్కని వ్యాధిలా ఉందని, దీన్ని ఆదిలాబాద్ లో ఉండే తన గురువు నయం చేయగలడని చెప్పి ఓ ఐదుగురితో కలిసి ఆమెను తీసుకుని కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ చెట్టు వద్ద పూజలు చేయాలని మార్గ మద్యలో ఆపి ఆమెకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశారు.

అనంతరం బాధితురాలి నగ్న పోటోలను తీసి డబబ్ులకోసం బెదిరించడం ప్రారంభించారు. దీంతో సదరు మహిళ ఏం చేయాలో తెలీక ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆదిలాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుల కోసం గాలిస్తున్నారు.