కన్న కూతురినే గొంతుకోసి చంపిన కసాయి తల్లి

First Published 9, Feb 2018, 2:40 PM IST
madya pradesh cruel mother
Highlights
  • మద్యప్రదేశ్ లో దారుణం
  • కన్నకూతురినే పొట్టనపెట్టుకున్న తల్లి

తన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతుంటుంది అమ్మ. అది అమ్మకు పిల్లలపై ఉండే ప్రేమ. తన కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తుంటుంది. అలాంటి మాతృప్రేమకు మచ్చతెచ్చే సంఘటన మద్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

మధ్యప్రదేశ్ ధార్ ప్రాంతానికి చెందిన అనిత కు ఏడాదిన్నర వయసుండే కూతురు ఉంది. అయితే ఈ పాప అస్తమానం పాలకోసం మారాం చేస్తూ ఏడుస్తుండేది. అయితే ఈ పాపను ఓదార్చి ప్రేమగా పాలను మాన్పించాల్సింది పోయి ఈ తల్లి సహనాన్ని కోల్పోయి అమ్మ తనానికే మచ్చతెల్లేలా ప్రవర్తించింది. ఎంతకీ పాప ఏడుపు ఆపకపోవడంతో గొంతు కోసి హత్య చేసింది. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావమై చనిపోయింది.  ఈ పాప గొంతుకోసాక చాలా సేపు ప్రాణాలతో కొట్టుమిట్టాడి ఉంటుందని, అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చిన్నారి చివరకు ప్రాణాలు వదిలిందని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.  బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఈ నివేదిక ఆదారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
 

loader