ఒకే రూములో ఆడ, మగ కు వైద్యపరీక్షలు (వీడియో)

First Published 2, May 2018, 5:57 PM IST
Madhya Pradesh during recruitment of police constables Medical checkup
Highlights

ఆడ అభ్యర్థుల మందు బట్టలు తీసేయాల్సిందిగా వైద్యులు ఆదేశించారు.

 మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లా ఆసుపత్రిలో పురుష అభ్యర్థులు, స్త్రీ అభ్యరులకూ కలిపి ఒకే రూములో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి తెరచాటు లేకుండా పక్కపక్కనే వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా, స్త్రీ, పురుషుల తేడాలేకుండా అందరికీ మగ డాక్టర్లే పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల సందర్భంగా మగవాళ్లను 18 మంది ఆడ అభ్యర్థుల మందు బట్టలు తీసేయాల్సిందిగా వైద్యులు ఆదేశించారు. పురుష అభ్యర్థులు ఒంటిపై కట్‌డ్రాయర్ మినహా ఏమీ లేకుండా వరుసలో నించోబెట్టారు. ఒక అధికారి వారి వివరాలు నోట్ చేసుకుంటూ వచ్చారు. ఈ వ్యవహారం అంతా ఎవరో రికార్డు చేయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడ,మగవాళ్లను ఒకే రూములో ఉంచి కనీసం మహిళా డాక్టర్‌ను అందుబాటులో ఉంచకుండా వైద్యపరీక్షలు నిర్వహించడంపై పలువురు భగ్గుమంటున్నారు. 

 

loader