Asianet News TeluguAsianet News Telugu

జయప్రకాశ్ నారాయణ్ తప్పొప్పుకున్నారు...

ఆశయం గొప్పదే గానీ ప్రధాని నోట్ల రద్దు చాలా అనాలోచిత నిర్ణయం

Loksatta public intellectual Jayaprakash Narayana demonetization confession

లోక్ సత్తాపార్టీ నిర్మాత జయప్రకాశ్ నారాయణ్ (జెపి) తప్పొప్పుకున్నారు.

 

ప్రధాని మోదీ తీసుకు వచ్చిన నోట్లరద్దును బాగా భుజానేసుకుని మోసిన  ‘పబ్లిక్ ఇంటెలెక్చువల్స్’ లో ఆయన ఒకరు. రెండు నెలల తర్వాత, దేశంలో  చిన్న చితక ప్రజల జీవితాలు తలకిందులయ్యాక, ఆయనిపుడు ప్రధాని తీసుకున్న నిర్ణయం అనాలోచితమయిందని సెలవిస్తున్నారు.

 

జెపి ఉపన్యాసాలను విన్న వేలాది మంది యువకులు, ఆయన్నో మేధావి గా భావించి, ఆయన చెప్పిందంతా విని, దేశం మేలు కోరే మోదీ  నోట్లను రద్దు చేశారని నమ్మిన ప్రజలు, ఆయన వార్తలన్నింటిని చదివిన లక్షాలది మంది పాఠకులు,నవ్వాలా? ఏడ్వాలా.

Loksatta public intellectual Jayaprakash Narayana demonetization confession

నిన్న డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఇలా అన్నారు.

 

“ ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినపుడు ఆయనకు మద్దతు తెలిపిన వారిలో నేను మొదటివాడిని.కాని, తర్వాత దాని పర్యవసానాల గమనిస్తే, ఇది ఎంత ఆనాలోచిత చర్యో అర్థమయింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ఉద్యోగులు, చిన్న వ్యాపారులు మొదలుకుని, అన్ని వర్గాల వారు, తమ డబ్బు తాము తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. కాయకష్టం చేసి చిన్న సంపాదన తో జీవిస్తున్న చిరుద్యోగుల, కార్మికుల, రైతుల జీవనం అస్తవ్యస్తమయిపోయింది. ఆ నిర్ణయం వెనక ఆశయం మంచిదే కాని, ఆచరణలో సాధక భాధకాలు అలోచించకుండా దేశాన్ని ఒక గందరగోళంలోకి నెట్టేశారు,”అని ఆయన అన్నారు.

 

అంతా బాగుంది. ప్రధానిది అనాలోచిత చర్యే.  ఈ ఆనాలోచిత చర్యని, ముందు వెనక ఆలోచించకుండా,పర్యవసానాలు బేరీజు వేయకుండా,  సమర్ధించడం అనాలోచితం కాదా.

 

జెపి ఒక డాక్టర్.  అంతకంటే ముఖ్యంగా భారత దేశంలో పరిపాలనను మొత్తంగా మోసే  ఇండియన్ అడ్మినిష్ట్రేష్ సర్వీనుంచి వచ్చారు. ఈ సర్వీసు వారి సలహాలతోనే కదా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు నిర్ణయాలు తీసుకునేది. ‘ప్రధాని నిర్ణయానికి మద్దతు తెలిపిన మొదటివాడు’ అని అనిపించుకోవాలనే ఆత్రుత దేనికి.

 

  ప్రధాని నిర్ణయం కొంప ముంచబోతున్నదని , ప్రకటన  వెలవడిన అర్థరాత్రి నుంచే సాధారణ ప్రజలు పసిగట్టారు.

 

 

 తెలుగు రాష్ట్రాలలో  ‘నెంబర్ వన్’  కోవకు చెందిన పబ్లిక్ ఇంటెలెక్చువల్ అయిన జయప్రకాశ్ నారాయణకు మాత్రం అరవై రోజులు పట్టింది.

 

ప్రజలకు మార్గదర్శకత్వం అందివ్వాల్సిన  పబ్లిక్ ఇంటెలెక్చువల్ అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే ఎంత హాని జరుగుతుంది. ప్రధానికి ఇంకా కనువిప్పుకలగకుండా ఉండేందుకు కారణం   నోట్ల రద్దు ను మోసిన, ఇంకా మోస్తున్న  పబ్లిక్ ఇంటెలెక్చువల్సే కదా.

 

జయప్రకాశ్ నారాయణ్ పశ్చాత్తాపం చూస్తే అమెరికా న్యాయకోవిదుడు రిచర్డ్ ఎ పోస్నర్ రాసిన ‘పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ : ఎ స్టడీ ఆఫ్ డిక్లయిన్ ’ గుర్తుకొస్తుంది. ఇందులో పబ్లిక్ ఇంటెలెక్చువల్ గురించి ఆయనో మాట అంటాడు:

 

 "Public intellectuals are not accountable to the market. They don't pay a price for their mistakes ( which they seldom acknowledge in the first place); there are no gatekeepers to maintain "the quality controls that one finds in other markets for goods and services."

 

ఎంత ప్రమాదం?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios