దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్‌ జాతీయ పార్కులో ఓ వ్యక్తి దారి తప్పి వన్య ప్రాణుల పార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చాడు. పారిపోతున్న అతడిని వెంబడించిన సింహం దాడి చేసింది. గత నెల 28న సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి అకస్మాత్తుగా వచ్చాడు. ముందు సింహం ఉన్న చోటుకి ఎదురుగా వెళ్లాడు. అంతలోనే వెనక్కు పరుగెత్తుతూ కనిపించాడు.

ఏం జరుగుతోంది అని తెలుసుకునే లోపే ఓ సింహం అతడిని తరమడం ప్రారంభించింది. ప్రాణ భయంతో అతను ‘కాపాడండి.. కాపాడండి’ అంటా అరవడం ప్రారంభించాడు. అతనిపై ఒక్కసారిగా విరుచుకుపడిన సింహం తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.