Asianet News TeluguAsianet News Telugu

కర్నాటకలో టిఆర్ ఎస్-టిడిపి కోల్డ్ వార్

కర్ణాటక ఎన్నికల వల్ల తెలుగు పార్టీల మధ్య కోల్డ్ వార్ వూపందుకుంది. 

karnataka becomes arena for TRS TDP coldwar

(జింకా నాగరాజు)

కర్ణాటక ఎన్నికల వల్ల తెలుగు పార్టీల మధ్య కోల్డ్ వార్ వూపందుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎలాగైనా బిజెపిని వోడించేందుకు కర్నాటకలోకి తెలుగువాళ్లను ప్రభావితం చేయాలని చూస్తుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి  కాంగ్రెస్ ను ఓడించేందుకు సిద్ధమయింది. బిజెపిని ఓడించేందుకు తెలుగుదేశం ప్రత్యక్షంగా క్యాంపెయిన్ చేయకపోయినా,  కర్నాటకలోని అంధ్ర సెటిలర్స్ కు ఈ మేరకు రకరకాల రూపాలలో సందేశాలు పంపుతూఉంది. ఆంధ్ర తెలుగు సంఘాలు కొన్ని ‘ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇవ్వకుండా మోదీ ద్రోహం చేశారని, మోదీకి ఆంధ్ర దెబ్బ చూపించా’లని బాహాటంగా చెబుతున్నాయి. అయితే, ఆంధ్రలో బిజెపి మీద తీవ్రంగా వ్యతిరేకత ఉన్నందున,  తెలంగాణ రాష్ట్రసమితి కాంగ్రెస్ ను ఓడించాలని బిజెపి తరఫున ప్రచారం చేసేందుకు వీలుకాదు.  అందువల్ల ముఖ్యమంత్రి కెసిఆర్ అక్కడి జనతాదళ్ ఎస్ ను ఎంచుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జనతా దళ్ తరఫున ఆయన ప్రచారం చేయాలని నిర్ణయించారు. చాలా మంది టిఆర్ ఎస్ నేతలు అపుడే కర్నాటక బయలు దేరి వెళ్లారు. జనతాదళ్ ఎస్ కు ఎక్కువ వోట్లు వస్తే, కాంగ్రెస్ పెద్ద పార్టీ ఎన్నికయినా త్రిశంకు సభ ఏర్పడుతుంది. అపుడు జనతాదళ్(ఎస్), బిజెపి కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు మార్గం ఎర్పడుతుంది. కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ కాంగ్రెస్ రెచ్చిపోయే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వస్తుంది. అంతేకాదు, కర్నాటక నుంచి లన్నిరకాల సహాయం తెలంగాణ కాంగ్రెస్ కు అందవచ్చు. కాబట్టి ఏవిధంగా తీసుకున్నా అక్కడ కాంగ్రెస్ గెలవడం కెసిఆర్ కు మంచిది కాదు.

బిజెపిని అధికారం లోకి తెచ్చేందుకే కెసిఆర్ జనతాదళ్ (ఎస్ )తరఫున ప్రచారం చేస్తున్నారని సిపిఐ సీనియర్ నాయకుడు కె నారాయణ,  కాంగ్రెస్ ముఖ్యఅధికారప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె సింహాద్రి  అంటున్నారు. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేవేగౌడను కలుసుకోవడం వెనక కాంగ్రెస్ ను ఓడించి, బిజెపి అధికారంలోకి తెచ్చే పథకం ఉందని వారు అరోపిస్తున్నారు.


ఇక ఆంధ్ర విషయానికొస్తే, మోదీ మీద తెలుగుదేశం ఆగ్రహం కర్నాటక కాంగ్రెస్ కు పనికొచ్చే లాగా ఉంది.  కర్నాటకలో అనేక జిల్లాలలో వ్యవసాయం  కోసం, వ్యాపారం కోసం ఆంధ్రావాళ్లు  వలస వెళ్లి సెటిల్ అయ్యారు. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం మద్దతుదారులే. వీరు తెలివిగా ఈ ఎన్నికల్లో  తెలుగు దేశం పొలిటికల్ లైన్ ప్రకారం ప్రచారం చేయాలనుకుంటున్నారు. వారు  ఫలానా పార్టీకి వోటేయండని చెప్పకుండా, ఆంధ్రాకు ద్రోహం చేసిన మోదీని ఓడించండనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టారు. ‘ మేం తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ కు మేలు జరిగితే జరగొచ్చు. మోదీని, బిజెపి ఓడించి ఆంధ్రుల సత్తా చాటుతాం. ఆంధ్రకు ద్రోహం చేసి మోదీ తప్పించుకోలేడు,’అని బళ్లారికి చెందిన  చెన్నుపాటి సూర్యానారాయణ చౌదరి అంటున్నారు. చౌదరి కుటుంబం ఎపుడో వ్యవసాయం కోసం అక్కడికివెళ్లి స్థిరపడింది. అయితే, ఆయన ఇంకా ఆంధ్ర అభిమానే.


కర్నాటకలో దాదాపు 15 శాతం మంది తెలుగువారున్నారని అంచనా. కనీసం 12 జిల్లాల్లో తెలుగువారి వోట్లు జయాపజయాలను నిర్ణయిస్తాయి. అవిజ బెంగుళూరు అర్బరన్, బెంగుళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపుర, టుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి,కొప్పల్, రాయచూరు, కలబురగి,యాద్ గిర్,  బీదర్.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొంతమంది ప్రతినిధులను పంపి కాంగ్రెస్ ను గెలిచినా సరే, బిజెపికి మోదీకి వ్యతిరేకంగా వోటేయండని కులసంఘాల ద్వారా చెబుతున్నారు. మోదీని ఓడించాలనే పట్టుదల ఇంతబలంగా  ఉండటానికి కారణం, వైసిపి అండచూసుకునే మోదీ తనని అవమాన పర్చారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకుఆయనమోదీ మీద కసి తీర్చుకోవాలనుకుంటున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నారు. దీనికితోడు కెసిఆర్ రాజకీయాలకు టిడపి కి నచ్చడం లేదు. ఫెడరల్ ఫ్రంటుపేరుతో  ఎక్కడో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి ని కలుసుకుంటున్నారు, ఒదిషా ముఖ్యమంత్రి ని కలుసుకోవాలనుకుంటున్నారు. తనని ఖాతరు చేయడం లేదని, దీనికి కారణం, ఆయన ఫెడరల్ ఫ్రంటు వెనక మోదీ ఉండటమే అనే అనుమానం కూడా టిడిపి నేతలో ఉందని చెబుతున్నారు. అందుకే మోదీని ఓడించేందుకు ఆయన శతావిధాల ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios