కరీంనగర్ పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను ఆయిల్ ట్యాంకర్ డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను డీ కొట్టడంతో ఆటో లో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా చామనపల్లి కి చెందిన కొందరు కూలీలు కూలీ పనుల కోసం వేరే ఊళ్లకు వెలుతుంటారు. ఎప్పటిలాగే కూలీలు పక్క గ్రామంలో పత్తి ఏరే పని మీద ఆటోలో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న ఆటో కరీంనగర్ పట్టణ శివారులోని మల్కాపూర్ వంతెన వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్  ఆటోను డీ కొట్టింది. దీంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు తీవ్రంగా గాయపడగా కరీంనగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.