రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు చేపట్టిన ధర్మపోరాట దీక్ష కి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు  మద్దతు తెలపగా.. తాజాగా సినీ నటుడు, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కూడా ఆ జాబితాలో చేరారు. ట్విట్టర్ ద్వారా తన మద్దతు తెలియజేశారు.

సర్‌..మీరు మీ పుట్టినరోజున మీ రాష్ట్రం కోసం దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో నేను ఎప్పుడూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్టే ఇప్పుడు చెప్పలేను. కానీ ఈ పోరాటంతో మీరు విజయం సాధించాలని ఆశిస్తున్నాను.’ అని ట్వీట్‌ చేశారు.

కమల్‌ ఇటీవల తన రాజకీయ పార్టీని ప్రకటించినప్పుడు తాను చంద్రబాబు అభిమానని అన్నారు. పార్టీని ప్రారంభించడానికి ముందు రోజు రాత్రి చంద్రబాబుకు ఫోన్‌ చేసి సలహాలు అడిగానని చెప్పిన విషయం తెలిసిందే.