కట్జూ... మళ్లీ ఏశాడు

justice katju says like amitabh Rajini too has nothing in his head
Highlights

  • రజనీ రాజకీయ వార్తలపై తనదైన స్టైల్ లో స్పందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

దేశంలో అత్యంత ప్రజాదారణ ఉన్న తారల్లో తలైవా రజనీకాంత్,  సూపర్ స్టార్ అమితాబ్ లు ముందు వరసలో ఉంటారు. ఇక సినీఅభిమానులైతే వీరిని దేవుళ్లలా ఆరాధిస్తారు. వాళ్లు తెరపై కనిపిస్తేనే పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. అలాంటిది ఆ ఇద్దరు సూపర్ స్టార్ లపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కెండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఈ ఇద్దరు తెరవేల్పులకు అసలు బుర్రే లేదని ప్రకటించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కడం ఈయనకు అలవాటే. గతంలో గాంధీపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఈయనకుంది.

 

ఇటీవల రజనీ రాజకీయ ప్రవేశంపై మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కట్జూ తన ఫేస్ బుక్ పేజీలో రజనీ  గురించి పోస్టు పెట్టారు.

 

ఇంతకీ తన ఫేస్ బుక్ పేజీలో ఏం రాశారంటే...

 

‘నాకు దక్షణ భారతీయులపై గొప్ప గౌరవం ఉంది. కానీ, వారు సినీతారలను పిచ్చిగా ఎందుకు అభిమానిస్తారో అర్థం కాదు. నేను అన్నామలై యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఓ ఫ్రెండ్ తో కలిసి శివాజీ గణేషన్ సినిమాకు వెళ్లాను.

సినిమా మొదటి సీన్ లోనే శివాజీ గణేషన్ పాదాన్ని తెరపై చూపారు. వెంటనే థియేటర్లో ఉన్న అభిమానులు హిస్టిరియా వచ్చినట్లు ఊగిపోయారు.

ఇప్పుడు అదే స్థాయిలో దక్షణాది వారు రజనీని అభిమానిస్తున్నట్లున్నారు. చాలా మంది ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

కానీ, రజనీలో ఏం ముంది. పేదరికం, నిరుద్యోగం, పౌష్టికాహారలోపం తదితర సమస్యలను పరిష్కరించే సత్తా ఆయనకు ఉందా... వాటిపై కనీసం ఆయనకు అవగాహనైనా ఉందా...

నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ లాగా ఆయన బుర్రలో ఏమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు రజనీని రాజకీయాల్లోకి రమ్మంటున్నారు. ’ అని తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ పేజీలో పంచుకున్నారు.

 

loader