కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఎక్కడున్నాడో తెలియదు.. కానీ, ఆయన నుంచి ఓ సమాచారం వచ్చింది.
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ జాడ కోసం పోలీసులు సీరియస్ గా వెతుకుతున్న సమయంలో ఓ వార్త ఆయన నుంచి వచ్చింది.
కర్ణన్ ఆచూకీ లభించనప్పటికీ ఆయన తన మనసు మార్చుకున్నట్లు దాన్ని బట్టి తెలుస్తోంది.
కర్ణన్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ అభ్యర్థన పత్రాన్ని కోర్టుకు అందజేయగా దాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.
కోర్టు ధిక్కారం కేసులో జస్టిస్ కర్ణన్ తీరుపై ఫైర్ అయిన సుప్రీం ధర్మాసనం ఈనెల 9న ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వెంటనే కర్ణన్‌ను అరెస్టు చేయాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది.
అయితే ఆ లోపే కర్ణన్ జాడ తెలియకుండా పోయారు. ఇప్పటికీ ఆయన ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.
