స్వాతిపై కేసు..ఆందోళన చేస్తున్న జర్నలిస్టులు

First Published 19, Apr 2018, 4:06 PM IST
journalists conducts rally and they demand to withdraw police case against swathi vadlamudi
Highlights

కార్టూన్ వేసినందుకు స్వాతిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.


హిందు పత్రిక  సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేస్తూ..గురువారం హైదరాబాద్  జర్నలిస్ట్ యూనియన్( TWJF) ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేశారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన తెలిపారు.   ఈ సందర్భంగా హైదరాబాద్ జర్నలిస్టు యూనియన్(TWJF) అధ్యక్షులు ఇ. చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న ఆఘత్యాలను, అత్యాచారాలను ఉటంకిస్తూ హిందూ పత్రిక జర్నలిస్టు స్వాతి వడ్లమూడి వేసిన కార్టూన్ పై రాద్దాంతం చేస్తూ బెదిరింపులకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. భావప్రకటన పై జరుగుతున్నదాడిగా అభివర్ణించారు. జర్నలిస్టు స్వాతి పై పెట్టి న కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఓ మహిళా జర్నలిస్టు పై జరుగుతున్న కుట్రను మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఖండించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్టులు..... ఈ. చంద్రశేఖర్,నవీన్,దామోదర్, నాగవాని,రమేశ్,రాజశేఖర్, మమతా,పి.శివశంకర్,సమ్మెటవెంకటేష్,నర్సింహ,చైతన్య,రాము,రాంబాబు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

loader