యమహా నుంచి స్పోర్ట్స్ బైక్

John Abraham launches the Yamaha YZF R3 at Auto Expo 2018
Highlights

యమహా నుంచి స్పోర్ట్స్ బైక్

ఆటో ఎక్స్ పోలో విడుదల చేసిన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా  సంస్థ భారత మార్కెట్ లోకి స్పోర్ట్స్ బైక్ ని విడుదల చేసింది. ‘వైజడ్‌ఎఫ్‌-ఆర్‌3’  పేరిట విడుదల చేసిన ఈ బైక్ ధర రూ. 3.48 లక్షలు ( ఎక్స్‌ షోరూం దిల్లీ)గా ప్రకటించారు. డ్యుయల్‌ ఛానెల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్ (ఏబీఎస్‌)‌, 321 సీసీ కెపాసిటీ గల ఇంజిన్‌తో దీనిని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. గ్రేటర్‌ నొయిడాలో జరుగుతోన్న ఆటో ఎక్స్‌ పోలో యమహా బ్రాండ్‌ అంబాసిడర్‌, బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహమ్‌ ఈ స్పోర్ట్స్‌ బైక్‌ను ఆవిష్కరించారు.  అన్ని రహదారులపై  కూడా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ డ్యూయల్ ఛానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

loader