ద‌స‌రా కానుక‌గా జియో ఫోన్‌

First Published 3, Sep 2017, 12:02 PM IST
jio phone delivery date was announced
Highlights
  • జియో ఫోన్ డెలివరీ డెట్ చెప్పేశారు.
  • దసరా కానుకగా ఫ్రీ బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ.
  • రెండు రోజుల్లో 60 లక్షలకు పైగా ఫ్రీ బుకింగ్స్.

ఖాతాధారుల‌కు జియో ఫోన్ ను ద‌స‌రా కానుగా అందించేదుకు యాజ‌మాన్యం నిర్ణ‌యింది. ఈనెల 21వ తేదీ నుండి ఫోన్ల డెలివ‌రీ మొద‌లుపెడుతున్నారు. గ‌తంలో  సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో డెలివ‌రీ అని చెప్పారు. కాక‌పోతే ఊహించిన దానిక‌న్న‌ స్పంధ‌న పెరిగిపోవ‌టంతో డెలివ‌రీ తేదీ మూడో వారానికి వాయిదా వేశారు. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 60 లక్షల జియో ఫోన్ బుక్ మంది బుక్ చేసుకున్నారు.

 ఆగస్టు 24న ఈ ఫోన్ల బుకింగ్ ప్రారంభం కాగా, ఈ ఫోన్ ఉచితమే అయినప్పటికీ సెక్యూరిటీ డిపాజిట్ కింద సంస్థ రూ.1500 వసూలు చేస్తోంది. బుకింగ్ సమయంలో రూ.500 కట్టించుకోగా, డెలివరీ అనంతరం మిగతా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సొమ్మును మూడేళ్ల తర్వాత జియో తిరిగి వినియోగదారుడికి చెల్లించనుంది. 

 

 

మరింత సమాచారం కోసం కింద క్లిక్ చేయండి   

 

loader