మళ్ళీ ఆఫర్లు ప్రకటించిన జియో

Jio one more Cashback Offer Benefits of Up to Rs 799 on Recharge of Rs 398 and Above
Highlights

  • ప్రైమ్ మొంబర్లకు జియో..బంపర్ ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ జియో... తన ప్రైమ్ కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం జియో ప్రైమ్ మెంబర్లకు  క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రవేశపెట్టింది.  ఈ ఆఫర్ ప్రకారం... జియో ప్రైమ్ వినియోగదారులు రూ.398 లేదా ఆపైన విలువ గల ప్యాక్‌తో రీచార్జి చేసుకుంటే వారికి రూ.799 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.400 విలువైన 8 ఓచర్లు వస్తాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలపై ఉపయోగించుకుని ఆమేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఒకసారి ఒక ఓచర్‌ను మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. ఇక మిగిలిన రూ.399 క్యాష్‌బ్యాక్ ఆయా వాలెట్స్ ద్వారా కస్టమర్లకు లభిస్తుంది. మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పే, ఫ్రీ చార్జ్, యాక్సిస్ పే తదితర వాలెట్లలో ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొబిక్విక్ ద్వారా రూ.398 ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జి చేసుకునే వారికి రూ.2500 విలువ గల హోటల్ ఓచర్ లభిస్తుంది. ఇక పేటీఎం ద్వారా రీచార్జి చేసుకుంటే సినిమా టిక్కెట్లపై 50 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

loader