మరో మూడు నెలల పాటు జియో ఆఫర్ పొడగింపు
టెలికాం సంచలనం జియో తన వినియోగదారులకు త్వరలో మరో శుభవార్తను అందించనుంది. పూర్తి ఉచిత టాక్ టైంతో సంచలనం రేపిన జియో ఇప్పిటకే రెండు సార్లు ఆఫర్ ను పొడిగించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ముచ్చటగా మూడో సారి మరో మూడు నెలల పాటు తమ ఆఫర్ ను పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై ఇప్పటి వరకు రిలయన్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలో ఆ శుభవార్త ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొదట ‘వెల్‌కమ్ ఆఫర్’ పేరిట ఉచిత టాక్ టైం ఆఫర్ ప్రకటించింది. ఆ తర్వాత ‘హ్యాపీ న్యూఇయర్ ఆఫర్’ పేరిట మార్చి 31 వరకు దాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి ఈ ఆఫర్ ను కొద్ది మార్పులతో పొడగించనున్నారు. ఈ ఆఫర్ ముగిసేలోగా కాల్‌డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవాలని జియో భావిస్తున్నట్లు సమాచారం.
