జేసీ సోదరులు భయపడుతున్నారు

జేసీ సోదరులు భయపడుతున్నారు

సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ సోదరులు నిజంగానే భయపడుతున్నారా..? దశాబ్ధకాలంగా ఎలాంటి  అదురు బెదురు లేకుండా కాలం గడిపిన వీళ్లు ఇప్పుడెందుకు భయపడుతున్నారు? ప్రస్తుతం అనంత రాజకీయాల్లో ఈ ప్రశ్నలు కీలకంగా మారాయి. జేసీ సోదరులు భయపడుతున్నారంటూ అందరూ చర్చించుకుంటున్నారు..

అసలు విషయం ఏమిటంటే.. కొంత కాలం క్రితం వైసీపీ నేత ఉదయభాస్కర్ హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ హత్య కేసుతో జేసీ సోదరులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో..ఈ కేసులో నిజానిజాలు భయటపడతాయేమోనని జేసీ సోదరులు భయపడుతున్నట్లు సమాచారం.

ఇదే విషయంపై వైసీపీ తాడిపత్రి ఇంఛార్జి కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్‌ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

వైఎస్సార్‌ సీపీ నేత ఉదయ్‌భాస్కర్‌ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు పడతాయని జేసీ సోదరులకు భయం పట్టుకుందని అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడమే చంద్రబాబు విధానమా అని ప్రశ్నించారు. జేసీ సోదరులు పద్ధతి మార్చుకోకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అప్పేచర్ల గ్రామంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos