Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాలకు జయప్రద గుడ్ బై

దాదాపు ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఆమె గుడ్ చెబుతున్నారు. సమాజ్ వాది పార్టీనుంచి వైదొలిగాక ఆమె ఒడ్డు దొరకడం లేదు.  దాని ఫలితమే ఈ నిర్ణయం

jayaprada bids goodbye to politic to restart movie life

మళ్లీ రాజకీయాల్లోకిరావడం కష్టంగా ఉన్నట్లుంది, ప్రముఖ నటి, సమాజ్ వాది పార్టీ మాజీ ఎంపి జయప్రద ఇక రాజకీయాలలో ఉండనంటున్నారు. ఈ విషయాన్ని ఆమె బెంగుళూరు లో స్పష్టం చేశారు. సమాజ్ వాది పార్టీ నుంచి ఆమె ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి పోటీ చేసి  గెల్చారు. తర్వాత పార్టీ నుంచి ఆమె ను బహిష్కరించారు. అప్పటినుంచి ఆమె రాజకీయాల ప్రస్తానం దాదాపు ఆగిపోయింది. తెలుగుదేశం పార్టీలో చేరుతుందన్నారు.కాంగ్రెస్ కు వస్తుందన్నారు. తాజా2015 లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె భారతీయ పార్టీలో చేరాల్సి ఉంది.  ఒక దశ లో ఆమె ఆంధ్ర ప్రదేశ్ కు వెనక్కు వచ్చి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతుందన్నారు. అయితే, ఇవేవీ నిజం కాలేదు. అందువల్ల ఆమె ఇపుడు సీరియస్ సినిమాల్లోకే వెళ్లిపోవాలనుకుంటున్నారు.  ఎటు తేలని రాజకీయాల వల్ల సినిమా చాన్స్ లు పోతున్నాయని ఆమె ఆందోళన చెందుతున్నారు.  ఇకపై తాను రాజకీయాల్లో కొనసాగనని జయప్రద స్పష్టం చేశారు. మళ్లీ సినిమాలకే అంకితమవుతానని ఆమె పేర్కొన్నారు. బెంగళూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉండడంతో దర్శకులు తన వద్దకు సరైన పాత్రలతో రావడం లేదని ఆమె చెప్పారు. ఇకపై రాజకీయాలు పక్కనబెట్టి, సినిమాలపైనే దృష్టి కేంద్రీకరిస్తానని  ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను నాలుగు చిత్రాలు చేస్తున్నానని  చకెబుతూ  మంచి పాత్ర దొరికితే నిడివి తక్కువైనా నటించేందుకు తాను సిద్ధమేనని ఆమె వెల్లడించారు.

రాజకీయ ప్రస్థానం

1994లో ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. అపుడు జరిగిన ఎన్నికలలో పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలయ్యారు. 1996 ె లో టిడిపి తరఫున రాజ్యసభ కు  నామినేట్ అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో విబేధాలొచ్చాయి. రెండో సారి నామినేట్ కాలేకపోయారు. దానితో ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు గెల్చాక , పార్టీ నుంచి బహిష్కృతురాలయ్యారు. అంతే.  ఆ తర్వాత ఆమెకు ఒడ్డు దొరక లేదు. ఏ పార్టీలో చేరాలో,  ఎటు పోవాలో తెలియలేదు. చివరకు ఇపుడు ఇక రాజకీయాలు చాలనుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios