Asianet News TeluguAsianet News Telugu

జగన్ బాటలో జయ మేనకోడలు ’ఓదార్పు‘ యాత్ర

 జయ మరణంతో ‘అవేదన’ చెందుతున్న ప్రజలను పరామర్శించి,  వారి ఆశీస్సుల కోసం మేనకోడలు దీప తమిళనాట ‘ఓదార్పు యాత్ర’ కు సిద్ధమవుతున్నారు.

jaya niece Deepa to take up Vodarpu yatra in Tamilnadu

రాజకీయాలన్నీ ఒక లాగే ఉంటాయి. రాజకీయ తారలంతా ఒకే తీరుగా పుడతారు. ఒక లాగే చమక్కులు చిందిస్తారు. వైఎస్ ఆర్ చనిపోయాక, హతాశులయిన వైఎస్ ఆర్ అభిమానులను కలుసుకునేందుకు  జగన్ ఒక పక్క నుంచి, శర్మిల మరకవైపు నుంచి రాష్ట్రమంతా పర్యటించి వైఎస్ వారసత్వానికి  ఆమోద ముద్ర వేయించుకున్నది మనకు తెలుసు. 

 

ఇపుడు తమిళనాడులో జయలలిత వారసత్వం కోసం అమె మేనకోడలు దీప జయకుమార్ కూడా జగన్ చూపిన దారిలో వెళుతున్నారు.  జయ మృతితో శోకిస్తున్న అభిమానులను పరామర్శించేందుకు,వారితో మాట్లాడేందుకు రాష్ట్రమంతాపర్యటించబోతున్నారు.  నేనున్నాని ప్రజలను ఓదార్చి, జయలేని లోటు తీర్చేందుకు నేను ప్రయత్నిస్తానని చెప్పాలనుకుంటున్నారు.

 

ఆమె తన యాత్ర విషయం నిన్న ప్రకటించారు. ఎఐఎడిఎంకె లోెని  ఏదో శక్తి ఆమెను నడిపిస్తూ ఉందని అనుకుంటున్నారు. ఎంతవరకు విజయవంతమవుతారోగాని,  ఇక అమెను ఆపడం కష్టమని అంటున్నారు.

 

తమిళనాడు రాజకీయాలలో అమె ఇపుడు  కొత్త విఐపి అయ్యారు. ‘నా రాజకీయప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అదన చూసుకుని ఒక నిర్ణయం తీసుకుంటా. మీ అందరి కోసం పనిచేసేందుకు నేను ఎదురుచూస్తున్నాను,’ అని అమె  రాజకీయ భాషలో మాట్లాడేస్తున్నారు.

 

నిన్న మొదటి సారి తన ఇంటికి వచ్చిన సందర్శనకులనుద్దేశించి ప్రసంగించారు.

 

ఈ సందర్శకుల ప్రవాహ స్ఫూర్తితోనే దీప ఇపుడు రాష్ట్ర మంతా  ఓదార్పు యాత్ర చేప్టటాలనుకుంటున్నారు. ప్రజలను కలుసుకుని మాట్లాడాలనుకుంటున్నారు. జయ కు నిజమయినవారసురాలు తాను అవునా కాదని ఆమె జనాన్ని అడిగి ఆమోదం తీసుకోవాలనుకుంటున్నారు. ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వచ్చి జయలలిత వదలివెళ్లిన రాజకీయ  కార్యక్రమాన్ని పూర్తి చేస్తానంటున్నారు.

 

జయలలి అనారోగ్యంతో ఉన్నపుడు దీపను అనుమతించలేదు.అయితే, జయలలిత చనిపోయాక దీప పేరుమీద రాజకీయ పోస్టర్లు రాష్ట్రమంతా వెలిశాయి.

 

ఇపుడు విపరీతంగా ప్రజలు అమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఇది చూస్తూ తమిళనాడు రాజకీయాలలో మరొకచోద్యమేదో జరగబోతున్నట్లు అర్థమవుతుంది. అలాంటిదే వూహించి గాని  ప్రజలలా ఆమె దర్శనం కోసంఎగబడుతున్నారా?పోయస్ గార్డెన్ లో జరగే రాజకీయ తంత్రాల మీద జనంలో అనుమానలొస్తున్నట్లు అర్థమవుతుంది.

 

 ఇలా అనుకోకుండా తనఇంటికి వస్తున్న  వస్తున్న సందర్శకులను చూశాక, దీప ఆలోచన లో మార్పరావడం మొదలయింది.  వికె శశికళకు పార్టీ పగ్గాలు అప్పచెప్పిన తర్వాత జరగుతున్న పరిణామమిది. ఈ  అనుకోని పరిణామంతో, దీప రాజకీయల్లోకి వచ్చే రంగం సిద్ధమవుతున్నదని అనుకుంటున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios