హోదా పోరు.. దోశెలు వేసిన ఎమ్మెల్యే

First Published 19, Apr 2018, 11:41 AM IST
jagayyapeta MLA sriram tatayya make dosa in hotel over special status
Highlights

దోశెలు వేసి స్వయంగా వినియోగదారులకు అందించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే  శ్రీరాం తాతయ్య.. వినూత్న నిరసన చేపట్టారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గంలో  రిక్షా తొక్కి నిరసన తెలిపిన ఆయన తాజాగా మరో వినూత్న ప్రయత్నం చేశారు.
 స్థానిక హోటల్ లో దోశలు వేశారు. హోటల్ కి వచ్చిన వినియోగదారులందరికీ ఆయనే స్వయంగా దోశెలు వేసి అందించారు. కాగా.. ఆయన దోశెలు వేయడాన్ని కార్యకర్తలు, పార్టీ నాయకులు , అభిమానులు ఆసక్తిగా తిలకించారు. హోదా నినాదాలు చేస్తూ.. ఎమ్మెల్యేని ఉత్సాహపరిచారు.

loader