జగన్ చెప్పిన ‘సినిమా’ కథ

జగన్ చెప్పిన ‘సినిమా’ కథ

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ సినిమా కథ వినిపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో బేతంచర్లలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. ఒకవైపు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగండుతూనే.. మరోవైపు తనను తాను హీరోగా పరిచయం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బేతంచర్ల ప్రజలకు ఆయన ఓ కథ వినిపించారు.

‘‘14రీల్స్ సినిమాలో.. 13 రీల్స్ హీరో కష్టాలుపడతాడు. చివరి రీల్ లో విజయం సాధిస్తాడు. మొదటి 13 రీల్స్.. విలన్ రెచ్చిపోతాడు. హీరోపై పైచేయి సాధిస్తాడు. కానీ.. 14వ రీల్ కి వచ్చే సరికి సీన్ రివర్స్ అవుతుంది. హీరోని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా ఉంటారు. అప్పుడు హీరో.. విలన్ ని ఫుట్ బాల్ ఆడుకుంటాడు’’ అని జగన్  చెప్పారు. ఈ కథలో జగన్ తనని  తాను హీరోగా, చంద్రబాబు ని విలన్ గానూ  చెప్పకనే చెప్పారు. అంతేకాదు... సినిమా అయినా, మహాభారతం, రామాయణం ఇలా ఏది తీసుకున్నా.. అంతిమ విజయం మాత్రం న్యాయానిదేనని తెలిపారు. జగన్ చెప్పిన  ఈ కథకి వైసీపీ నేతల నుంచి మాత్రం ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos