Asianet News TeluguAsianet News Telugu

‘పచ్చ’ మీడియాపై విరుచుకుపడ్డ జగన్

  • పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్
  • తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • ఇదంతా చంద్రబాబు కుట్రేనన్న జగన్
jagan fires on chandrababu and yellow media

తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తున్న ‘పచ్చ’ మీడియాపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో కావాలనే తన పేరుతో  తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏదైనా గొప్ప కార్యక్రమం మొదలుపెడుతున్నానని తెలియగానే.. ఇలాంటి ప్రచారాలు చేయడం, చంద్రబాబుకు, ఆయన తోక పత్రికలు, చానెళ్లకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. తనపై దుష్ప్రచారం చేయడానికి కేటాయించిన సమయాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి వినియోగిస్తే.. ప్రజలకు మేలు జరిగేదన్నారు.

నంద్యాల ఎన్నికల సమయంలోనూ మీడియా ఇదేవిధంగా తనపై దుష్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నంద్యాల ఉప ఎన్నిక సమయంలో.. తాను బీజేపీలో చేరుతున్నారంటూ కథనాలు రాశారన్నారు. మైనార్టీ ఓట్లు తనకు పడకుండా ఉండేందుకు చంద్రబాబు.. పచ్చ పత్రికలతో కలిసి తప్పుడు కథనాలు ప్రచురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి నడుస్తున్నది చంద్రబాబేనని, తాను కాదని వెల్లడించారు. చంద్రబాబు నోరుతెరిస్తే అబాద్ధాలు చెబుతారని, ఆయన మనస్సు మొత్తం కుళ్లు నింపుకున్నారని జగన్        విమర్శించారు. రాజకీయాల్లో తాను ఎల్లప్పుడూ నీతిగా, నిజాయితీగానే ఉన్నానని స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి కొడుకు తప్పు చేశాడని ఎప్పుడూ అనుపించుకోనని, ఏం చేసినా నిజాయితీగా చేస్తానని, నీతిగా ఉంటానని జగన్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios