Asianet News TeluguAsianet News Telugu

అమెరికా యాత్ర: బాబు ఉత్త చేత తిరిగొచ్చాడని ఎవరన్నారు?

చివరిరోజున ముఖ్యమంత్రి చంద్రబాబు  అమెరికాలో ఎత్తయిన భవంతులు చూశారు.అమరావతి తయారువుతున్నపుడు ఆయన ఈ భవనాలను చూడటం అవసరం. పర్యటన అమెరికా టిడిపి వారి పాదాభివందనాలతో, ఫోటో సెషన్ తో  ముగిసింది. దీనికి సంబంధించిన వీడియోని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.తప్పక చూడాల్సిన వీడియో ఇది.

Its wrong to say  chandrabad returned  empty handed from US

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలో ఎనిమిదిరోజులు పర్యటించి ఏమేమి  చూశారు.

ఏమి చూసినా, ఏమి చేసినా, ఉత్త చేతులతో రాలేదు.

 

రెండు అవార్డులు తీసుకుని వచ్చారు. గతంలో ఎవరికీ ఇలా రెండు అవార్డు ఒక ట్రిప్పులో రాలేదన్నది రికార్డు.  ఒక అవార్డును ‘ట్రాన్స్ ఫరమేటివ్ ఛీఫ్ మినిష్టర్’ యుఎస్ ఇండియాబిజినెస్ సొసైటీ వారిస్తే,రెండోదాన్ని అక్కడి ఎంపి డేనియల్ డేవిస్ ‘ యుస్ కాంగ్రెసినల్ లైట్ ఆఫ ది లైఫ్ 2017 ’ అవార్డు ఇచ్చారు (పై బ్యానర్  ఫోటో). ఎందుకిచ్చారో తెలియదు.

 

ఉద్యోగాలు పెట్టుబడుల సంగతేమిటో గాని, ఈ రెండయితే కచ్చితంగా ఆయన చేతికందాయి. వాటిని భౌతికంగా తీసుకునే వచ్చారు.

 

చివరిరోజున ఆయన అమెరికాలో ఎత్తయిన భవంతులు చూశారు.అమరావతి తయారువుతున్నపుడు ఆయన ఈ భవనాలను చూడటం అవసరం. పర్యటన అమెరికా టిడిపి వారి పాదాభివందనాలతో, ఫోటో సెషన్ తో ముగిసింది. దీనికి సంబంధించినవీడియోని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.తప్పక చూడాల్సిన వీడియో అది(పైన).

 

ముఖ్యమంత్రి తన పర్యటన గొప్పదనంగురించి ఇలా చెప్పారు:

 

  • ఏడురోజుల పర్యటనలో 5 నగరాలను సందర్శించాను. 7 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాను.
  • 30కి పైగా సమావేశాల్లో పాల్గొన్నాను.
  •  90కి పైగా కంపెనీల ప్రముఖులు, ప్రతినిధులను కలిశాను.
  • 12500 పైచిలుకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
  • వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఫింటెక్, హార్డ్‌వేర్, ఐటీ, ఇంటర్నెట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
Follow Us:
Download App:
  • android
  • ios