శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు.ప్రత్యే ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

 శనివారం తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట ఒక కిలోమీటర్‌ మేర భక్తులు బారులుతీరి నిలబడ్డారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు.

ప్రత్యే ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం నాడు శ్రీవారిని 81,347 మంది భక్తులు దర్శించుకున్నారు.

స్వామివారి హుండీకి రూ. 2.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.