ఫిబ్రవరి 15 న పంచ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న శ్రీహరికోట స్పేస్ సెంటర్ షార్ 

ఒకే రాకెట్ లాంచ్ లో 103 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రయోగించేందుకు ISRO శాస్త్రవేత్తలు ముహుర్తం ఎంపిక చేశారు. ఫిబ్రవరి 15 ఉదయం 9.07 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ నుంచి నుంచి వివిధ దేశాలకు చెందిన 100 ఉపగ్రహాలతోపాటు మూడు భారత్ ఉపగ్రహాలను కూడ మోసుకుని పీఎస్‌ఎల్వీ సి-37 నింగిలోకి ఎగురుతున్నది.

 గతంలో ఎక్కువ ఉపగ్రహలను ఒకే లాంచ్ లో ప్రయోగించిన అమెరికా రష్యాలను భారత్ ఇపుడు అధిగమిస్తుంది.

ఈ ప్రయోగంపై తిరువనంతపురంలో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కే. శివన్ ఈ రోజు వివరాలందించారు.

ప్రయోగం తర్వాత ఉపగ్రహాలు రాకెట్ లాంచర్ నుంచి కక్ష లోకి విడుదలవుతాయని , వేరుపడే సమయంలో ఒకదానికి ఒకటి సంబంధం ఉండదని అన్నారు.

సెకెనుకు మీటరు వేగంతో ప్రయోగ వాహనం నుంచి ఉపగ్రహాం వేరుపడుతుందని. మొదటి విడుదలయిన ఉపగ్రహం తర్వాత దానికంటే వేగంగా ప్రయాణిస్తుందని, దీని వల్ల రెండింటి మధ్య వేగంలో తేడా ఉంటుందనిఆయన చెప్పారు.

ఉపగ్రహాల మధ్య నిరంతరం దూరం పెరుగుతున్నా కక్ష్యలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఉపగ్రహ వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించేవరకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉపగ్రహాలను వేరుచేయడానికి సన్నాహాలు చేశామని శివన్ వెల్లడించారు.